Razole: రాజోలు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

Razole: ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాజోలులో జనసేన వీర మహిళల ప్రత్యేక పూజలు, హోమాలు. ప్రజా సేవలో త్వరగా పాల్గొనాలని ప్రార్థన.

PRABHU, RAZOLE
Published on: 11 July 2026 8:02 PM IST
Razole
X

Razole: రాజోలు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

రాజోలు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో రొటేటర్ కఫ్ సమస్యకు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో జనసేన వీర మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజోలు గాంధీ బొమ్మ సెంటర్‌ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టి, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, త్వరలోనే ప్రజా సేవలో తిరిగి పాల్గొనాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు ఉలిశెట్టి అన్నపూర్ణ ,మేడిచర్ల సత్యవాణి,దార్ల కుమారి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story