Rajavommangi: అర్నబ్ తుఫాన్ ప్రభావంపై జేసీ, సబ్ కలెక్టర్ పర్యటన!
Rajavommangi: రాజవొమ్మంగి మండలంలో అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను పరిశీలించిన జేసీ ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ పృథ్వీ రాజ్. అధికారులకు పలు కీలక ఆదేశాలు.
Rajavommangi: అర్నబ్ తుఫాన్ ప్రభావంపై జేసీ, సబ్ కలెక్టర్ పర్యటన!
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్,రంపచోడవరం సబ్ కలెక్టర్ డి.పృథ్వీ రాజ్ కుమార్ విస్తృతంగా పర్యటించి,అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులు, కూలిన చెట్ల తొలగింపు పనులు, సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బుదవారం రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు,నెలిమెట్ల కాలువను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ ,రంపచోడవరం సబ్ కలెక్టర్ డి.పృద్వి రాజ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో విపత్తులు ఎదుర్కొనే విధంగా జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
అదేవిదంగా రహదారులపై కూలిన చెట్లను తొలగించే పనులను వేగవంతం చేయాలని సంబందిత అధికారులను ఆయన ఆదేశించారు. జేసీబీల సహాయంతో రహదారులపై ఉన్న అడ్డంకులను తక్షణమే తొలగించి, ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆయన సూచించారు.
ఆదేవిదంగా ఇంటిపై కూలిన చెట్టును జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని, జరిగిన నష్టాన్ని అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ కారణంగా ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందువలన వాగులు వంకలు పొంగుతాయని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువలు దాటే ప్రజలు కాలువలు దాట వద్దని ఆయన తెలిపారు.
పెద్ద పెద్ద గాలులు వీచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండవద్దని అదేవిధంగా అవసరాన్ని బట్టి ఇంట్లో నుండి బయటకు రావాలని ప్రజలను ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో పోలవరం జిల్లాలో కరెంటుకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఎక్కడైనా కరెంట్ స్తంభాల మీద చెట్లు పడిన యెడల వెంటనే స్పందించి తొలగించేందుకు ఎక్కడికి అక్కడ ప్రత్యేక టీములను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జేసీ, సబ్ కలెక్టర్ వారి వెంటా తహసీల్దార్ స్వామీ ,సీ ఐ సన్యాసి నాయుడు,ఎస్ ఐ షరీఫ్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.




