Gokavaram: గోకవరంలో ₹38.46 లక్షల CMRF చెక్కుల పంపిణీ!

Gokavaram: కాకినాడ జిల్లా గోకవరం మండలంలో 45 మంది బాధితులకు ₹38.46 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అందజేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 4 Sept 2026 3:44 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరంలో ₹38.46 లక్షల CMRF చెక్కుల పంపిణీ!

Gokavaram: ఆపదలో ఉన్నవారిని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఆదుకుంటుందని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. గోకవరం మండలంలో అనారోగ్యంతో చికిత్స పొందిన వారికి నవీన్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. 45 మంది కి గాను సుమారు రూ.38,46,428 ల చెక్కులను అందించారు. ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు. నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.

ప్రజలకు అండగా ఉండటమే జ్యోతుల నెహ్రూ లక్ష్యమని, ఎవరూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్లి మరీ చెక్కులు అందిస్తున్నామని అన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story