Kadiam: పల్స్ పోలియో సన్నాహక సమావేశం.. మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే

Kadiam: జూన్ 28న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని కడియం మండలంలో విజయవంతం చేయాలని ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ పిలుపునిచ్చారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 18 Jun 2026 9:10 PM IST
Kadiam
X

Kadiam: పల్స్ పోలియో సన్నాహక సమావేశం.. మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే

కడియం: పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ అన్నారు. జూన్ 28 వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా, దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని, గురువారం, కడియం మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మండల వైద్యాధికారులు డాక్టర్ ఎన్ జెస్సీ సుప్రియ, డాక్టర్ ఎం మణి జ్యోత్స్న మాట్లాడుతూ కడియం మండల పరిధిలో 6114 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా 36 బూత్ లు, 2 ట్రాన్సిస్ట్ టీంలు, 2 మొబైల్ టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మొదటి రోజున పోలియో చుక్కలు వేయించకపోతే 29, 30 తేదీ లలో ఇంటింటి సర్వే చేసి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎమ్ఎస్ మణి కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు యు శిరీష, నాగ జయలక్ష్మి, ఏఎన్ఎం లు, ఎంఎల్హెచ్పి లు, సిహెచ్ఓ లు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story