Kadiyam: కడియంలో మనోజ్ పోలీక్లినిక్ను ప్రారంభించిన మాజీ ఎంపీపీ ప్రసాద్
Kadiyam: కడియంలో డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనోజ్ పోలీక్లినిక్ను మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ గురువారం ప్రారంభించారు.
Kadiyam: కడియంలో మనోజ్ పోలీక్లినిక్ను ప్రారంభించిన మాజీ ఎంపీపీ ప్రసాద్
కడియం: మండల కేంద్రమైన కడియం గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న వెలుగుబంటి రామచంద్రరావు వ్యాపార సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మనోజ్ పోలీక్లినిక్ను మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ గురువారం ప్రారంభించారు.
ఎంబిబిఎస్ డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పోలీక్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ కడియం ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నూతనంగా ప్రారంభమైన పోలీక్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని, జగతా సత్యనారాయణ, పసుపులేటి సత్యనారాయణ, మోసిగంటి ప్రసాద్, పొన్నగంటి చిన్నయ్య తదితరులు పాల్గొని డాక్టర్ మనోజ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.




