Kadiyam: కడియంలో తారుమారైన రాజకీయాలు: వైఎస్సార్‌సీపీ జోరు!
Kadiyam: కడియం మండలంలో రాజకీయం మారింది. వైఎస్సార్‌సీపీ తరఫున 21 నామినేషన్లు దాఖలు కాగా, అధికార కూటమిలో ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Kadiyam: కడియంలో తారుమారైన రాజకీయాలు: వైఎస్సార్‌సీపీ జోరు!
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో రాజకీయాలు తారుమారవుతున్నాయి.. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులు లేరనే ప్రచారం కొనసాగగా అందుకు బిన్నంగా గురువారం ఆ పార్టీ అభ్యర్థులు 21 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. జనసేన ఎనిమిది, టిడిపి ఐదు, బిజెపి నాలుగు స్థానాల్లో నామినేషన్ లు దాఖలు చేశారు.. మూడు పార్టీలు కలిపినా వైసీపీ కంటే తక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
మరోపక్క వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కొత్తపల్లి శివాజీ కూడా హుకుంపేట ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా తాడాల విష్ణు చక్రవర్తి సతీమణి రాజరాజేశ్వరిని ఆ పార్టీ ముఖ్య నాయకులు అధికారికంగా ప్రకటించారు. కూటమిలో ఇప్పటివరకు ఎంపీపీ అభ్యర్థిని గాని జెడ్పిటిసి అభ్యర్థిని గాని అధికారికంగా ప్రకటించలేదు జనసేన అభ్యర్థినని రత్నం అయ్యప్ప స్వయం ప్రకటన చేసుకొని రేపు నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధపడ్డారు.
అలానే టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా బోడపాటి పుణ్యవతి గా ప్రచారం జరుగుతుంది తప్ప ఇప్పటివరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఆమె పేరును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో కడియం మండలంలో గందరగోళం నెలకొంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్నప్పటికీ కూటమిలో స్పష్టత లేకపోవడం... వైసిపి పూర్తి స్పష్టత తో ముందుకు సాగటం కనిపిస్తోంది.




