Kadiyam: కూలీలపై రైతుల మమకారం.. చీరలు, లుంగీలు పంపిణీ చేసి సత్కారం!

Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ఉపాధి హామీ కూలీలను రైతులు ఘనంగా సత్కరించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 20 Jun 2026 9:04 PM IST
Kadiyam
X

Kadiyam: కూలీలపై రైతుల మమకారం.. చీరలు, లుంగీలు పంపిణీ చేసి సత్కారం!

కడియం: మండలం దుళ్లలో రైతులు శనివారం స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద ఉపాధి హామీ కూలీలను ఘనంగా సత్కరించారు. రైతుల కొలగారం సొమ్ములు నుంచి సుమారు 20 వేల రూపాయలు విలువైన చీరలు, లుంగీలు, తువ్వాళ్ళు ను 72 మంది ఉపాధి కూలీలకు పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా చిట్టూరి వెంకన్న చౌదరి, గుర్రపు కొండయ్య మాష్టారు, సూరపురెడ్డి భరత్ లు మాట్లాడుతూ ఉపాధి కూలీలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కూలి సొమ్ములు కోసం కాకుండా తమ సొంత ఇంటిలా పంట కాలువను శుభ్రం చేసిన ఉపాధి కూలీలకు ఎంత చేసినా తక్కువే అన్నారు.

అలాగే ఇటీవల కాలంలో గ్రామంలో సేవా భావం పెరిగి అనేక మంది రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. అలాగే స్థానిక స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కోర్టు లావాదేవీలు ఉండడంతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు నిలిచాయని, త్వరలోనే అడ్డంకులు తొలగిపోయి స్మశాన వాటిక అభివృద్ధి పధంలో దూసుకెళుతుందని, అందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story