Kadiyam: ధరల నియంత్రణే 'మీమార్ట్' లక్ష్యం: మాజీ ఎంపీపీ ప్రసాద్
Kadiyam: కడియం మండలం దుళ్లలో 'మీ మార్ట్' దుకాణాన్ని మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ ప్రారంభించారు; మార్కెట్ కంటే తక్కువ ధరలకే సరుకులు లభిస్తాయని వెల్లడించారు.
Kadiyam: ధరల నియంత్రణే 'మీమార్ట్' లక్ష్యం: మాజీ ఎంపీపీ ప్రసాద్
కడియం: నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణే "మీమార్ట్" షాపుల ముఖ్య ఉద్దేశ్యమని కడియం మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ అన్నారు. ఆదివారం కడియం మండలం, దుళ్ల గ్రామంలో "మీ మార్ట్" షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రేషన్ షాపులను ఆధునీకరించి మినీ సూపర్ బజార్ లుగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం "మీ మార్ట్" లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మీ మార్ట్ లలో బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను విక్రయిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని కోరారు. దుళ్ల తో పాటు కడియపులంక, వీరవరం, జేగురుపాడు గ్రామాలలో కూడా మీ మార్ట్ షాపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మండల పౌరసరఫరాల అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ మీ మార్ట్ లలో ఏ విధమైన అవకతవకలు జరిగినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




