Kadiyam: దుళ్ళ నూతన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించిన మంత్రి కందుల
Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన పాలకవర్గాన్ని మంత్రి కందుల దుర్గేష్ అభినందించి సత్కరించారు.
Kadiyam: దుళ్ళ నూతన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించిన మంత్రి కందుల
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాన్ని రాష్ట్ర టూరిజం ,సినీ ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు.
కూటమి పార్టీల మద్దతుతో సర్పంచ్ గా భారీ మెజార్టీ తో విజయం సాధించిన సూరపురెడ్డి శిరీష భరత్, ఉప సర్పంచ్ నూలు ప్రసాద్, ఎంపీటీసీ మెర్ల వరలక్ష్మి అయ్యప్ప,12 మంది వార్డు సభ్యులు ,వారి గెలుపుకు సహకరించిన టిడిపి గ్రామ అధ్యక్షులు మాజీ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ తదితరులను మంత్రి కందుల సత్కరించారు.
ప్రజా సంక్షేమ పాలనలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని మంత్రి కందుల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో టిడిపి ,జనసేన, బిజెపి పార్టీలు తన సత్తా చాటాయన్నారు . గోదావరి జిల్లాలో 99 శాతం గెలుపు సాధించామన్నారు. అదే జోష్ తో ప్రజావిశ్వాసాన్ని కోల్పోకుండా గ్రామ అభివృద్ధి ద్యేయంగా నూతన పాలకులు పనిచేయాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.




