Kadiyam: జేగురుపాడులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

Kadiyam: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో జేగురుపాడు పాములమెట్ట కాలనీలో కడియం సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 13 Jun 2026 8:03 PM IST
Kadiyam
X

Kadiyam: జేగురుపాడులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

Kadiyam: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కడియం సీఐ ఏ. వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని జేగురుపాడు గ్రామ పరిధి "పాముల మెట్ట" కాలనీ లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా రికార్డులు లేని 12 మోటార్ సైకిల్స్ ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న ఒక బెల్ట్ షాపును గుర్తించి 35 క్వార్టర్ డీపీఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

క్రొత్త, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి నమోదు చేసారు. కాలనీ ప్రజలకు అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే తక్షణమే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై నాగ దుర్గా ప్రసాద్ , ఈగల్ టీమ్ సిబ్బంది , స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story