Kadiyam: విలేకరులపై దాడిని ఖండిస్తూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం
Kadiyam: విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ కడియం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
Kadiyam: విలేకరులపై దాడిని ఖండిస్తూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం
కడియం: విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని, ఆ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కడియం ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. డి పట్టా భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు రాసిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల ప్రజాశక్తి విలేకరి సిగిరెడ్డి రమేష్ పై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం "కడియం ప్రెస్ క్లబ్" సభ్యులు కడియం పోలీస్ స్టేషన్ మరియు తహసిల్దార్ కార్యాలయాలలో వినతి పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై దాడులకు పాల్పడిన నిందితులను తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విలేకరులు భయపడకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ పూర్తి రక్షణ కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కడియం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిక్కాల సూరిబాబు, కార్యవర్గ సభ్యులు దూడల అర్జున్, శెట్టి పోసిబాబు, అన్నందేవుల సూర్యచంద్రరావు, కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, పళ్ళ వెంకటగిరి, యడ్ల నరేష్, కొప్పాక రమణ, అడ్డగల దుర్గా ప్రకాష్, అడ్డగళ్ల రామలింగేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.




