Kadiyam: గ్రానైట్ రాళ్లు పడి క్షతగాత్రుడైన యువకుడికి రూ.70 వేల సాయం

Kadiyam: కడియం మండలం మురమండలో గ్రానైట్ రాళ్లు పడి రెండు కాళ్లు దెబ్బతిన్న యువకుడికి కాపు ఐక్య వేదిక వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.70 వేల ఆర్థిక సాయం అందించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 13 Oct 2026 6:02 PM IST
Kadiyam
X

Kadiyam: గ్రానైట్ రాళ్లు పడి క్షతగాత్రుడైన యువకుడికి రూ.70 వేల సాయం

కడియం: కడియం మండలం, మురమండ గ్రామంలో గతనెలలో గ్రానైట్ రాళ్ళు దిగుమతి చేస్తున్న సమయంలో తుమ్మలపల్లి బాలు సాయి అనే యువకుడి పై రాళ్ళు పడి, రెండు కాళ్ళు దెబ్బ తినడంతో శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు.

బాలు సాయి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం తెలుసుకున్న "కడియం మండల కాపు ఐక్య వేదిక" వాట్సప్ గ్రూప్ అడ్మిన్ ఆదిమూలం సాయిబాబా స్పందించారు. కాపు ఐక్య వేదిక వాట్సన్ గ్రూపులో పిలుపు ఇచ్చి, సేకరించిన 70 వేల రూపాయల నగదు, గ్రూపు సభ్యులతో కలిసి మంగళవారం బాధితుడు బాలు సాయి కి అందజేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న కాపు ఐక్య వేదిక వాట్సాప్ గ్రూప్ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు మరియు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL