Kadiyam: కడియంలో ఘనంగా నర్సరీ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం!
Kadiyam: కడియంలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.
Kadiyam: కడియంలో ఘనంగా నర్సరీ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం!
కడియం: ఇటీవల జరిగిన సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం కడియం జిఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా బొరుసు సుబ్బారాయుడుతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, గోరంట్ల రవి రామ్ కిరణ్, మండల పరిషత్ అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతన కార్యవర్గం రైతుల సంక్షేమానికి, నర్సరీ రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
నర్సరీ రంగానికి ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రత్నం అయ్యప్ప నర్సరీ అసోసియేషన్ అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఐదు లక్షల రూపాయల చెక్కును దుర్గేష్ మరియు బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా అధ్యక్షుడు బొరుసు సుబ్బారాయుడికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, గట్టి నరసయ్య, మార్గాని సత్యనారాయణ, తాడాల విష్ణు చక్రవర్తి, పల్ల సుబ్రహ్మణ్యం, ముద్రగడ జమీ, పుల్లా పెద సత్యనారాయణ, పుల్లా రామారావు, ఆదిమూలం సాయిబాబా, నర్సరీ రైతులు పాల్గొన్నారు.




