Kadiyam: వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధా

Kadiyam: కడియపు సావరంలో వంగవీటి రంగా విగ్రహాన్ని వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 1 Oct 2026 10:07 PM IST
Kadiyam
X

Kadiyam: వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధా

కడియం: కుల మతాలకు అతీతంగా పేదవారి సమస్యల పరిష్కారానికి పోరాడిన యోధుడు దివంగత వంగవీటి మోహనరంగా అని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అక్టోబర్ 1 వ తేదీ, గురువారం సాయంత్రం కడియం మండలం, కడియపు సావరం గ్రామంలో దివంగత వంగవీటి రంగా విగ్రహాన్ని వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1985 నుండి 1988 వరకూ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ నాలుగు దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. నాటి తరం నుండి నేటి వరకు వంగవీటి ని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్న రంగా అభిమానులకు ధన్యవాదములు తెలిపారు.

ఏ వర్గాల అభ్యున్నతి కోసం, రంగా బలిదానం అయ్యారో ఆ వర్గాలకు రంగా అభిమానులు బాసటగా నిలవాలన్నారు. అనంతరం రంగా మిత్రమండలి కమిటీ సభ్యులను పూల మాలలు, శాలువాలు, మెమెంటో లతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గంధం పళ్ళంరాజు, జక్కంపూడి గణేష్, ఆకుల రామకృష్ణ, అన్నందేవుల చంటి, తాడల విష్ణు చక్రవర్తి, ఆదిమూలం సాయిబాబా, సాపిరెడ్డి సూరిబాబు, సాపిరెడ్డి కామేష్, రంగా మిత్రమండలి సభ్యులు, కడియం మండల కాపు ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL