Kadiyam: కడియం అభివృద్ధిలో రాజీ లేదు సర్పంచ్ వెలుగుబంటి ప్రసాద్

Kadiyam: కడియం సర్పంచ్‌గా గెలిచిన వెలుగుబంటి ప్రసాద్ అభినందన సభలో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రజాప్రతినిధులకు సత్కారం.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 29 Nov 2026 10:33 PM IST
Kadiyam
X

Kadiyam: కడియం అభివృద్ధిలో రాజీ లేదు సర్పంచ్ వెలుగుబంటి ప్రసాద్

కడియం: తనకు ఓటేసి అఖండ మెజార్టీ తో గెలిపించిన ప్రజా విశ్వాసాన్ని కాపాడుకుంటు కడియం గ్రామాభివృద్ధి లో రాజీ పడనని సర్పంచ్ వెలుగుబంటి ప్రసాద్ అన్నారు. కడియం పడాల వారి వీధిలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రసాద్ మాట్లాడారు. తాను గాని, తాను నిలిపిన అభ్యర్థులందరినీ ఆదరిస్తూ 4 దశాబ్దాలుగా గెలిపిస్తూ రాజకీయాల్లో ఉన్నత భవిష్యత్తు ను కల్పిస్తున్న కడియం ఓటర్లకు నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని హమీ ఇచ్చారు.

ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యర్థి చేసిన విమర్శలకు తాను గట్టిగా సమాధానం చెబుతానని ప్రసాద్ పేర్కొన్నారు. కడియం ఎంపీపీ బోడపాటి పుణ్యవతి గోపి మాట్లాడుచు 2014 ఎన్నికల్లో వైసిపి అధికారంలో ఉండగా ఎంపీపీగా వెలుగుబంటి ప్రసాద్ ధైర్యంగా పోటీ చేసి విజయ దుందుభి మోగించారన్నారు. అప్పట్లో స్థానిక ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభినందనలు అందుకొన్న ఘనత ప్రసాద్ ది అన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయకత్వం లో ఎంపీపీగా పనిచేసిన ప్రసాద్ వంటి సీనియర్ నాయకులు సలహాలు తీసుకుని కడియం మండల అభివ్రుద్ది సాధిస్తానని ఎంపీపీ అన్నారు.మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, టీడీపీ నాయకులు శాఖా పట్టాభి, ఎంపీటీసీ తమ్మిశెట్టి లేపాక్షి ప్రసాద్,గ్రామ ఉపాధ్యక్షులు అడబాల రామలక్ష్మి తదితరులు మాట్లాడుచు అభివృద్ధి కి చిరునామా వెలుగుబంటి కుటుంబం అన్నారు. కరోనా సమయంలో కుల, మత,వర్గ, పార్టీ రహితంగా సేవలందించి వందల మందికి ప్రాణ దాత గా నిలిచారన్నారు.

మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని మాట్లాడుతూ తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమవుతుందన్నారు.అనంతరం సర్పంచ్ ప్రసాద్ తో పాటు ఇటీవల గెలిచిన ఎంపీపీ బోడపాటి పుణ్యవతి జడ్పిటిసి రత్నం మహేశ్వరి దేవి, కడియం ఎంపీటీసీలకు వార్డు సభ్యులకు ఘన సత్కారం జరిగింది.అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించిన వెలుగుబంటి అభిమానులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు.నినాదాలు చేస్తు ఆనందాన్ని పంచుకొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL