Kothapeta: కాపు కార్పొరేషన్ రుణాలపై చైర్మన్ సుబ్బారాయుడు కీలక హామీ
Kothapeta: గోపాలపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆకుల రామకృష్ణను కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Kothapeta: కాపు కార్పొరేషన్ రుణాలపై చైర్మన్ సుబ్బారాయుడు కీలక హామీ
కొత్తపేట: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణను కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, తెలగ, బలిజ వర్గాలకు అందాల్సిన రుణాలు, కాపు రిజర్వేషన్లు మరియు రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం సమావేశం లో మాట్లాడిన కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపు, తెలగ, బలిజ వర్గాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు కార్పొరేషన్ రుణాల మంజూరుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందని, అదే క్రమంలో కాపు కార్పొరేషన్ రుణాల పంపిణీలో జరిగిన ఆలస్యాన్ని త్వరలో అధిగమించి లబ్ధిదారులకు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాపు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ ఆకుల రామకృష్ణ, జేఏసీ నాయకులతో కలిసి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడికి వినతిపత్రం అందజేశారు.




