Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శ్రీసుధ. ఆలయంలో ప్రత్యేక పూజలు.
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
అంతర్వేది: సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి గౌరవ శ్రీమతి P. శ్రీసుధ శుక్రవారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీ స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Next Story




