Amalapuram: చేయ్యూరులో అక్రమ ఆక్వా చెరువుల వివాదం: కలెక్టరేట్ వద్ద ఆందోళన!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చేయ్యూరు జేల్లగుంటలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్న ఆక్వా చెరువులపై గ్రామస్తులు నిరసన తెలిపారు.
Amalapuram: చేయ్యూరులో అక్రమ ఆక్వా చెరువుల వివాదం: కలెక్టరేట్ వద్ద ఆందోళన!
అమలాపురం: కాట్రేనికోన మండలం చేయ్యూరు జేల్లగుంట గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాలపై గ్రామస్తుల ఆందోళన. ఆక్వా చెరువుల తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని కలెక్టరేట్ వద్ద గ్రామస్తుల డిమాండ్.చేపల చెరువులకు అనుమతులు తీసుకుని రొయ్యల చెరువులు వేస్తున్నారని గ్రామస్తుల ఆరోపణ.నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వడం వల్ల గ్రామ పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్న గ్రామస్తులు
ఆక్వా చెరువుల కారణంగా తాగునీరు,సాగునీరు కలుషితమవుతోందని భయాందోళన.సాగునీరు కూడా కలుషితమై పంటలపై ప్రభావం పడుతుందని మండిపాటు కలుషిత నీటితో గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో నీరు వినియోగానికి పనికిరాక స్నానానికి కూడా బయట నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని గ్రామస్తుల ఆవేదన.సమస్యపై జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.ఆక్వా చెరువులపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.




