Rajahmundry: కడియం సత్యదేవా నర్సరీని సందర్శించిన సినీ నిర్మాత ఏవీ అనూప్!

Rajahmundry: కడియపులంకలోని ప్రసిద్ధ శ్రీ సత్యదేవా నర్సరీని కేరళ సినీ నిర్మాత ఏవీ అనూప్ సందర్శించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 7 Sept 2026 4:56 PM IST
Rajahmundry
X

Rajahmundry: కడియం సత్యదేవా నర్సరీని సందర్శించిన సినీ నిర్మాత ఏవీ అనూప్!

Rajahmundry: ప్రముఖ కేరళ సినీ నిర్మాత ఎవి అనూప్ ఆదివారం కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీ సందర్శించారు. నర్సరీ అధినేత పుల్లా ఆంజనేయులు ఆయనను ఆగ్లోనిమా థాయ్ మొక్కతో స్వాగతం పలికారు. నర్సరీ సందర్శన అనంతరం అనూప్ మాట్లాడుతూ మొక్కల నాణ్యత మరియు ప్లాంటేషన్ విధానం చాల అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

సుగంధ వాసననిచ్చే మొక్కల గురించి విషయాలు ఆంజనేయులు గారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆయన 2007లో నిర్మించిన "బిఫోర్ ది బ్రష్ డ్రాప్డ్" చిత్రానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం విభాగంలో కేరళ రాష్ట్ర చలనచిత్రం అవార్డు గెలుచుకున్నారు.

2017 లో "స్క్రిప్ట్ టు స్క్రీన్" నియమాన్ని అనుసరించి 51 గంటల 2 నిమిషాలలో నిర్మించిన "విశ్వ గురు" చిత్రం కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. 2023లో కేరళ ఫిలిం క్రిటిక్స్ అవార్డు గెలుచుకున్నారు. ఈకార్యక్రమంలో పుల్లా రామకృష్ణ, పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story