Kesanapalli: గొల్లపాలెంలో డెంగ్యూ మాసోత్సవాలు!
Kesanapalli: కేశనపల్లి పీహెచ్‌సీ పరిధిలోని గొల్లపాలెంలో డెంగ్యూ మాసోత్సవాల ర్యాలీ. ఇంటింటి సర్వే, ఫ్రైడే డ్రైడే పాటించాలని వైద్య బృందం పిలుపు.
Kesanapalli: గొల్లపాలెంలో డెంగ్యూ మాసోత్సవాలు!
Kesanapalli: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి పీహెచ్‌సీ పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌యూఓ ఆదినారాయణ ఆదేశాల మేరకు డాక్టర్ సాయిబాబా నాయుడు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ చంటి, మేల్ హెల్త్ అసిస్టెంట్లు కె. శివకుమార్, ఎస్. శ్రీరామమూర్తి, జి. గంగరాజు, ఎంఎల్‌హెచ్‌పీ స్వరూప, ఏఎన్‌ఎమ్ పార్వతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, పరిసరాల పరిశుభ్రత పాటించడం, దోమతెరలను వినియోగించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప వైద్య సిబ్బందికి సమాచారం అందించి చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు.




