Keshanapalli: కేశనపల్లి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన
Keshanapalli: శంకరగుప్తం-2లో డెంగ్యూ మాసోత్సవాల అవగాహన ర్యాలీ. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్రైడే డ్రై డే పాటించాలని ప్రజలకు వైద్య సిబ్బంది సూచన.
Keshanapalli: కేశనపల్లి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన
కేశనపల్లి: డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలోని శంకరగుప్తం-2 గ్రామంలో శనివారం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్.యు.ఓ. ఆదినారాయణ ఆదేశాల మేరకు డా. సాయి బాబా నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ చంటి, మేల్ హెల్త్ అసిస్టెంట్లు జి. గంగరాజు, కె. శివకుమార్, ఎస్. శ్రీరామ్ మూర్తి, ఎంఎల్‌హెచ్‌పీ కె. దివ్య గారు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై వివరించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి, ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ పాటించడం ద్వారా దోమల సంతతిని అరికట్టవచ్చని వివరించారు.
అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలను వినియోగించడం, పూర్తిస్థాయి దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స పొందాలని కోరారు.
ప్రజల సహకారంతోనే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.




