Keshanapalli: కేశనపల్లి తీరంలో విచిత్ర దృశ్యం.. స్థానికుల్లో భయం!

Keshanapalli: మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం సముద్ర తీరంలో నీరు రంగు మారింది. పరిశ్రమల వ్యర్థాలా లేదా సహజ మార్పులా అని స్థానికుల్లో తీవ్ర ఆందోళన.

PRABHU, RAZOLE
Published on: 10 July 2026 2:55 PM IST
Keshanapalli
X

Keshanapalli: కేశనపల్లి తీరంలో విచిత్ర దృశ్యం.. స్థానికుల్లో భయం!

Keshanapalli: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం సముద్ర తీరం వెంబడి శుక్రవారం విచిత్ర పరిస్థితి నెలకొంది. సముద్రపు నీరు తెట్టుగా తేలి రంగు మారినట్లు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురౌతున్నారు.

ఈ మార్పునకు కారణమేంటనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని పరిశ్రమల నుంచి ఏమైనా వ్యర్థాలు సముద్రంలోకి విడుదలయ్యాయా? లేక ఓఎన్జీసీ రిగ్‌ల నుంచి ఏవైనా వ్యర్థాలు సముద్రంలోకి చేరాయా? లేదా భూమి పొరల్లో సహజసిద్ధమైన మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ఘటనకు గల అసలు కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సంబంధిత శాఖ అధికారులు నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి, వాస్తవ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story