Konaseema: అగ్నికుల క్షత్రియులకే జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలి: సంఘం డిమాండ్!

Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జడ్పీ చైర్మన్ పదవిని నాగిడి నాగేశ్వరరావుకు కేటాయించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు అగ్నికుల క్షత్రియ సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు.

SURESH, AMALAPURAM
Published on: 11 Oct 2026 11:43 PM IST
Konaseema
X

Konaseema: అగ్నికుల క్షత్రియులకే జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలి: సంఘం డిమాండ్!

కోనసీమ: కోనసీమ అగ్నికుల క్షత్రియలకు సంఘం అధ్యక్షులు కర్రి స్వామినాథ్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ని కలవడం జరిగింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని, అలాగే పార్టీకి నిస్వార్థంగా సేవలందించిన సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు కి జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ పదవి కేటాయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్,

విద్యాశాఖ మంత్రి యువ నాయకులు లతో మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ,ఎమ్మెల్యే లతో మాట్లాడి తగ్గిన న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. అని కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు తెలియజేశారు.​

ఈ కార్యక్రమంలో తారాడి శివ(కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు), కామాడి రామకృష్ణ (పి.గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు), పొన్నాల రాజు (అమలాపురం టౌన్ అధ్యక్షులు),మైల ఏడుకొండలు(కార్యవర్గ సభ్యులు) మరియు సంఘ సభ్యులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM