Alamuru: ఢిల్లీ నుంచి వచ్చి చొప్పెల్లలో అయ్యప్ప దీక్ష చేపట్టిన యువకుడు!

Alamuru: స్నేహితుడి స్ఫూర్తితో ఢిల్లీకి చెందిన ప్రతాప్ సింగ్ సుమారు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి వచ్చి అయ్యప్ప దీక్ష చేపట్టారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 26 Nov 2026 2:13 PM IST
Alamuru
X

Alamuru: ఢిల్లీ నుంచి వచ్చి చొప్పెల్లలో అయ్యప్ప దీక్ష చేపట్టిన యువకుడు!

ఆలమూరు: స్నేహానికి స్ఫూర్తిగా నిలుస్తూ.. హిందూ ధర్మ సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకున్న ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చొప్పెల్ల గ్రామానికి చేరుకుని అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన దొడ్డ లీల సురేంద్ర కుమార్, ఢిల్లీకి చెందిన ప్రతాప్ సింగ్ చదువుకునే రోజుల నుంచి మంచి ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వీరి స్నేహబంధం కొనసాగుతోంది.

సురేంద్ర కుమార్ ప్రతి ఏటా అయ్యప్ప స్వామి దీక్ష చేపడుతుంటారు. ఈ క్రమంలో అయ్యప్ప దీక్ష విశిష్టత, నియమ నిష్ఠలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి తన స్నేహితుడు ప్రతాప్ సింగ్‌కు వివరించారు. దీంతో అయ్యప్ప స్వామి దీక్షపై ఆసక్తి పెంచుకున్న ప్రతాప్ సింగ్ తాను కూడా దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సుమారు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి చొప్పెల్ల గ్రామానికి చేరుకున్న ప్రతాప్ సింగ్, స్థానిక శివాలయం వద్ద పీఠం బూరయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేశాడు. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ 40 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో స్వామివారి దీక్షను చేపట్టాడు. అయితే తొలుత అయ్యప్ప దీక్ష గురించి తెలియని ప్రతాప్ సింగ్ తల్లిదండ్రులు తమ కుమారుడు సన్యాసం స్వీకరించాడేమోనని ఆందోళన చెందారు.

అనంతరం అయ్యప్ప స్వామి దీక్ష విశిష్టత, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, నియమాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తమ కుమారుడు ఇంతటి పవిత్రమైన దీక్ష చేపట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బూరయ్య గురుస్వామి ప్రతాప్ సింగ్‌ను చిరు సత్కారంతో అభినందించారు. నేటి యువతలో ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, మంచి నడవడిక పెంపొందాలని, ప్రతి యువకుడు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA