Malikipuram: ఆషాడం ఆఫర్ పేరుతో పేద కూలీలకు భారీ టోకరా!
Malikipuram: కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఘోర మోసం వెలుగుచూసింది.
Malikipuram: ఆషాడం ఆఫర్ పేరుతో పేద కూలీలకు భారీ టోకరా!
మలికిపురం: ఆషాడం ప్రత్యేక ఆఫర్, లక్కీ డ్రా పేరుతో పేద కూలీలను నమ్మించి వేలాది రూపాయలు కాజేసిన ఘరానా మోసం కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చి మొదట తక్కువ మొత్తాలతో లక్కీ డ్రాలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు లభిస్తాయని ప్రచారం చేశాడు. అనంతరం ఆషాడం ప్రత్యేక ఆఫర్ పేరుతో ఫ్రిజ్, ఎయిర్ కూలర్, డబుల్ కాట్ మంచం, వాషింగ్ మెషిన్, ద్విచక్ర వాహనాలు వంటి ఖరీదైన వస్తువులను అతి తక్కువ ధరకే అందిస్తామని నమ్మబలికాడు.
రోజువారీ కూలీ పనులపై ఆధారపడే నిరుపేదలే లక్ష్యంగా పలువురి నుంచి నగదు, ఫోన్‌పే ద్వారా వేలాది రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చేతికి రాగానే మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు.
మోసపోయామని గ్రహించిన బాధితులు మలికిపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై ఎం మోహన్ కుమార్ నిందితుడి ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో ఆకర్షించే అపరిచితులను నమ్మి నగదు చెల్లించవద్దని, అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.




