Atreyapuram: రైతు కష్టం, అన్నం విలువ తెలుసుకున్న చిన్నారులు: ఫలించిన కష్టం!

Atreyapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి ప్రధాన ఫౌండేషన్ పాఠశాల చిన్నారులు స్వయంగా వరి నాట్లు వేసి, పంట పండించి కోత కోసి ధాన్యాన్ని తయారు చేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 15 Nov 2026 12:31 PM IST
Atreyapuram
X

Atreyapuram: రైతు కష్టం, అన్నం విలువ తెలుసుకున్న చిన్నారులు: ఫలించిన కష్టం!

ఆత్రేయపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో 1, 2 తరగతులకు చెందిన చిన్నారులకు పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక వ్యవసాయ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు చింతా శ్యామ్ కుమార్ పర్యవేక్షణలో చిన్నారులు స్వయంగా మడిని తొక్కి, వరి నాట్లు వేసి, పంటను పండించి, కోత కోసి ధాన్యాన్ని తయారు చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా వరి పండించడానికి రైతులు పడే కష్టం, శ్రమ, ఓర్పును చిన్నారులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ధాన్యం నుంచి బియ్యం, బియ్యం నుంచి అన్నం మనకు చేరడానికి రైతు ఎంత కష్టపడతారో అర్థం చేసుకున్నారు.

రైతు కష్టాన్ని గౌరవించాలి… అన్నం విలువను గుర్తించాలి… ఒక్క మెతుకును కూడా వృథా చేయకూడదు… అనే గొప్ప సందేశాన్ని చిన్నతనం నుంచే పిల్లల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని శ్యామ్ తెలిపారు. పిల్లల్లో వ్యవసాయంపై అవగాహన, రైతుల పట్ల గౌరవం, ఆహారం పట్ల బాధ్యతను పెంపొందించే ఈ కార్యక్రమం ఒక అనుభవపూర్వక పాఠంగా నిలిచింది చిన్నారులు అన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA