Atreyapuram: ఆత్రేయపురంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన రొట్టె సతీష్!

Atreyapuram: ఆత్రేయపురం గ్రామానికి చెందిన చినపేట స్కూల్ కమిటీ చైర్మన్ రొట్టె సతీష్ టీడీపీని వీడి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 26 Nov 2026 2:19 PM IST
Atreyapuram
X

Atreyapuram: ఆత్రేయపురంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన రొట్టె సతీష్!

ఆత్రేయపురం: ఆత్రేయపురం గ్రామానికి చెందిన చినపేట స్కూల్ కమిటీ చైర్మన్ రొట్టె సతీష్ ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి గారు రొట్టె సతీష్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజలకు అందించిన సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

ఆత్రేయపురం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ, ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు పార్టీ బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు. రొట్టె సతీష్ చేరికతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA