Konaseema: గణేష్ నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల ఘర్షణ!

Konaseema: కోనసీమ అంబాజీపేట మండలం గంగలకుర్రులో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ; ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు.

RAJU, P GANNAVARAM
Published on: 24 Sept 2026 11:42 AM IST
Konaseema
X

Konaseema: గణేష్ నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల ఘర్షణ!

Konaseema: గణేష్ నిమజ్జన ఊరేగింపులో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు,అంబాజీపేట ఎస్ఐ షేక్ సుభానిలు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలోని గంగలకుర్రు పంచాయతీ పరిధిలోని గుంటమామిడి తోటకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. గుంటమామిడితోట నుండి శెట్టిబలిజ సామాజిక వర్గం ఊరేగింపుగా వెళ్తూ గంగలకుర్రు గ్రామంలో రావులమ్మ ఆలయం మీదుగా కాపు సామాజిక వర్గానికి చెందిన గణేష్ ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తుండగా ఊరేగింపును అక్కడ నిలుపుదల చేసి భారీ శబ్దంతో జగన్మోహన్ రెడ్డి పాటలతో పాటు వైసీపీ జెండాలను ఎగరవేస్తూ వీరంగం సృష్టించారు.

దీంతో గంగలకుర్రు కు చెందిన గణపతి ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపును ముందుకు తీసుకు వెళ్లాల్సిందని కోరగా మాట మాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది.దీంతో గంగలకుర్రుకు చెందిన జయను నరసింహమూర్తి,జయను లక్ష్మీనారాయణ,జయను మల్లికార్జునరావు,యాళ్ల వర ప్రసాద్, మేడేపల్లి సతీష్,

అరిగెల బాలసుబ్రమణ్యం లకు తలకు, చేతి వేళ్లకు,కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.విద్యుత్ దీపాల అలంకరణలో భాగంగా పాతిన కర్రలను పెకలించి తమ వారిపై సుమారు 40 మంది దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా మామిడితోటకు చెందిన వారికి కూడా గాయాలైనట్లు సమాచారం.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM