Amalapuram: అమలాపురంలో కాలువ పూడికతీత, పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్!

Amalapuram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కాలువ పూడికతీత, పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

SURESH, AMALAPURAM
Published on: 7 Oct 2026 3:16 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో కాలువ పూడికతీత, పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్!

Amalapuram: కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికతీత,గుర్రపుడెక్క,చెత్త వ్యర్థాల తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురం అర్బన్ కుమ్మరి కాలువ పూడిక తీత పనులు, నీటి ప్రవాహం పరిశీలించి వర్షాకాలం నేపథ్యంలో కాలువల్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

కాలువ,పరిసర ప్రాంతాలను ఇంజనీరింగ్, మున్సిపల్,రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జేసీబీలతో జరుగుతున్న పూడికతీత, వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించి,పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బ్రిడ్జి వద్ద ఇంజనీరింగ్ ప్లాన్‌లు, మ్యాప్‌లను పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన పూడిక,గుర్రపుడెక్క,చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన డంపింగ్ వ్యర్థాలను తొలగించి పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలన్నారు.ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.కాలువకు రక్షణ గోడ నిర్మాణం,రోడ్డు విస్తరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని,పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.కాలువల నిర్వహణ, పారిశుధ్య పనుల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పరిశీలనలో మునిసిపల్ కమీషనర్ ఎం నిర్మల్ కుమార్ వివిధ శాఖల అధికారులు,ఇంజనీరింగ్ సిబ్బంది,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM