Konaseema: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!

Konaseema: సీఎం చంద్రబాబు నాయుడు కోనసీమ పర్యటన నేపథ్యంలో అంబాజీపేటలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

SURESH, AMALAPURAM
Published on: 7 Sept 2026 4:34 PM IST
Konaseema
X

Konaseema: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డా.అర్.మహేష్ కుమార్, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ అధికారులు దేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ఏర్పాట్లు,భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు,పార్కింగ్,వైద్య, అగ్నిమాపక తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి, శాఖల వారీగా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆదేశించారు.ప్రత్యేక ఇన్‌ఛార్జులతో సమన్వయం ఏర్పటు చేసిన జిల్లా కలెక్టర్.

హెలీప్యాడ్,సభా వేదిక, ప్రభుత్వ స్టాళ్లు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశ ప్రాంతాలకు వేర్వేరుగా ప్రత్యేక అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఆయా అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ,రేపు మధ్యాహ్నానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజలు,లబ్ధిదారుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులను ఆదేశించారు. సభా సమయానికి 45 నిమిషాల నుంచి గంట ముందు మాత్రమే ప్రజలను వేదిక వద్దకు చేర్చాలని,ఎక్కువసేపు ఎండలో వేచి ఉండే పరిస్థితి కల్పించవద్దని సూచించారు.

ప్రజలకు తాగునీరు, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ట్రాఫిక్,పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కలెక్టర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలకు, సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలని,వాహనాల పార్కింగ్‌కు స్పష్టమైన ప్రదేశాలను గుర్తించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని డీఎస్పీని ఆదేశించారు.ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన బారికేడింగ్,పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ముఖ్యంగా హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసే మెష్ బారికేడింగ్ పనులను పక్కాగా పూర్తి చేసి, భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలి.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సభా వేదిక,హెలీప్యాడ్ వద్ద అత్యాధునిక అంబులెన్సులు, సరిపడా వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని DM&HOను కలెక్టర్ ఆదేశించారు. వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ తగినన్ని ఫైర్‌ ఇంజిన్లను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.భారీ వృక్షాలను తొలగించవద్దు అని కలెక్టర్ సూచించారు.పర్యటన ఏర్పాట్ల పేరుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.భారీ వృక్షాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని, ఏర్పాట్లకు అవరోధంగా ఉన్న చిన్నపాటి పొదలను మాత్రమే అవసరమైన మేరకు తొలగించాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శాఖల వారీగా సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో కొత్తపేట ఆర్డిఓ జీవీవి సత్యనారాయణ అంబాజీపేట తాసిల్దార్ చిన్నబాబు,వైద్య శాఖ అధికారి దుర్గారావు, అగ్నిమాపక శాఖ అధికారి పార్థసారథి రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఏపీఎస్ఆర్టీసీ అధికారి సత్యనారాయణమూర్తి, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story