Amalapuram: కోనసీమ ఖరీఫ్ సాగునీరు, తాగునీటిపై కలెక్టర్ సమీక్ష

Amalapuram: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు సకాలంలో అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం. కాలువల ఆక్రమణల తొలగింపునకు చర్యలు.

PRABHU, RAZOLE
Published on: 18 July 2026 5:33 PM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమ ఖరీఫ్ సాగునీరు, తాగునీటిపై కలెక్టర్ సమీక్ష

అమలాపురం: ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు సకాలంలో సాగునీరు, ప్రజలకు సురక్షిత తాగునీరు నిరంతరాయంగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాలువలు, డ్రైన్ల ఆక్రమణలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని, చివరి ఆయకట్టు రైతులకు కూడా సమానంగా సాగునీరు అందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కాలువల పూడిక తొలగింపు, లీకేజీల మరమ్మతులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, నీటి నాణ్యతపై రాజీ పడొద్దని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు రానున్న 10–15 రోజుల పాటు ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి, జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story