Konaseema: కౌశలం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు: కలెక్టర్

Konaseema: కోనసీమ జిల్లాలో కౌశలం పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు.

SURESH, AMALAPURAM
Published on: 13 Oct 2026 7:08 PM IST
Konaseema
X

Konaseema: కౌశలం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు: కలెక్టర్

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కౌశలం (KAUSHALAM) కార్యక్రమాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉద్యోగ నియామక డ్రైవ్‌లను నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగంగా కౌశలం పోర్టల్‌లో ఇప్పటివరకు మొత్తం 55,145 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని నమోదైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.

ఇప్పటికే 18.09.2026న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన మొదటి ఉద్యోగ నియామక డ్రైవ్‌లో MSN Laboratories సంస్థ ద్వారా 40 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.వారికి నియామక ఉత్తర్వులు కూడా అందజేయడం జరిగింది.

ఈ విజయవంతమైన కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితాలు అందుతున్నాయని కలెక్టర్ తెలిపారు.ఈ నెల 14.10.2026న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో Greentech Industries India Private Limited సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక డ్రైవ్ నిర్వహించబడుతుంది.

ఈ నియామక డ్రైవ్‌లో మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.ఉద్యోగ ప్రదేశం తిరుపతి జిల్లాలోని నాయుడుపేటగా పేర్కొనబడింది.SSC, ఇంటర్మీడియట్,డిగ్రీ, ITI తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు సంబంధిత ఉద్యోగానికి నిర్దేశించిన అర్హతలు,ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా పాల్గొనవచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1,86,000 నుండి రూ.1,98,000 వరకు వేతనం లభించే అవకాశం ఉంది.జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ నియామక డ్రైవ్‌లో పాల్గొని, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అభ్యర్థుల సమీకరణ,అవసరమైన ఏర్పాట్లు,నియామక ప్రక్రియ పర్యవేక్షణకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా SGSW అధికారి వి.విజయలక్ష్మి మాట్లాడుతూ, కౌశలం కార్యక్రమం ద్వారా అర్హులైన యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా SGSW శాఖ కృషి చేస్తోందని తెలిపారు. కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు,అవసరమైన ఇతర పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM