Konaseema: తండ్రి లేని ఆడపిల్లలకు అండగా నిలిచిన కలెక్టర్.. ఆదుకుంటామంటూ హామీ!
Konaseema: అంబేద్కర్ కోనసీమలో విషాదం.. తండ్రిని కోల్పోయి, మానసిక దివ్యాంగురాలైన తల్లితో అభాగ్యులుగా మారిన ముగ్గురు ఆడబిడ్డల దీన స్థితి.
Konaseema: తండ్రి లేని ఆడపిల్లలకు అండగా నిలిచిన కలెక్టర్.. ఆదుకుంటామంటూ హామీ!
Ambedkar Konaseema: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ పక్షవాతంతో బాధ పడుతూ అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు.ఆయన భార్య పూర్తిగా మానసిక దివ్యాంగురాలు. వారికి ముగ్గురు ఆడ పిల్లలు. తండ్రి మరణంతో ఆడ బిడ్డల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
తల్లికి దివ్యాంగ పెన్షన్ రూ.15 వేలు ఇప్పించాలని, ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కుటుంబానికి చేయూత నందించాలని కోరుతూ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు అర్జీ అందజేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావుకు ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలిసి ఉండడంతో ఆయనే స్వయంగా కలెక్టర్ గారికి అన్ని వివరాలు తెలియచేశారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఆడబిడ్డలు ప్రసన్న, జ్యోత్స్న ల వెంట, కొంకి వెంకట్రావు, ఇనుమర్తి రాజు, కోట ప్రసాద్, ఇనుమర్తి లింగమూర్తి ఉన్నారు.




