Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

Antarvedi: అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 12 Jun 2026 9:30 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

Antarvedi: డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్న కలెక్టర్‌కు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కే.టి.ఎన్.వి. ప్రసాద్ స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story