Mamidikuduru: హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ సంతాప కార్యక్రమాలు.
Mamidikuduru: కోనసీమ జిల్లా మామిడికుదురులో హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ సంతాప కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. భక్తులు నివాళులర్పించారు.
Mamidikuduru: హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ సంతాప కార్యక్రమాలు.
మామిడికుదురులో హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ సంతాప కార్యక్రమాలు
మామిడికుదురు : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు లో హజరత్ ఇమామ్ హుస్సేన్ పరివారానికి భక్తులు ఘనంగా నివాళులర్పించారు. హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ (అమరత్వం పొందిన 40వ రోజు) సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న సంతాప కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
భక్త బృందం ఆధ్వర్యంలో నగరం లోని బడే బీబీ పంజా వద్ద మజిలీస్ నిర్వహించారు. మత ప్రబోధకులు ఇబ్నే హసన్ మషద్ది మజిలీస్ ఆలపించి హజరత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని, సందేశాన్ని వివరించారు.
ఈ కార్యక్రమాలకు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం బడే బీబీ పంజా నుంచి పీరు గుర్రంపై ఊరేగింపుగా బయలుదేరి, పెదపంజీష వరకు మాతం నిర్వహిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.




