Konaseema: కోనసీమ జిల్లాకు వరద ముప్పు.. హై అలర్ట్!

Konaseema: కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతిపై జిల్లా యంత్రాంగం హై అలర్ట్.

SURESH, AMALAPURAM
Published on: 31 July 2026 4:57 PM IST
Konaseema
X

Konaseema: కోనసీమ జిల్లాకు వరద ముప్పు.. హై అలర్ట్!

కోనసీమ: కోనసీమ జిల్లా వరదలపై జిల్లా యంత్రాంగం హై అలర్ట్ లోతట్టు ప్రాంతాలు,లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ సూచన

లంక గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు.గర్భిణీలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశం.లంక గ్రామాల విద్యార్థులకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లా యంత్రాంగం.

విద్యార్థుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు.వరదల కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో పంట్లు (ఫెర్రీలు) రాకపోకలు నిలిపివేత. ఫెర్రీ సేవలు పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచన.

వరద నీటిలోకి వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని హెచ్చరిక.ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పిలుపు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని సూచన.ప్రజల భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ వెల్లడి.

వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story