Konaseema: కోనసీమలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు!
Konaseema: కోనసీమ జిల్లా సమనసలో జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి వేడుకలు జరిగాయి. కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే ఆనందరావు సాగు పనులను ప్రారంభించారు.
Konaseema: కోనసీమలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు!
Konaseema: ఏరువాక పౌర్ణమి రైతుల శ్రమకు గౌరవం ఇచ్చే సంప్రదాయ పండుగ అని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు. సోమవారం అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి భూమి పూజ చేసి, తొలి దుక్కి దున్ని జిల్లా స్థాయిలో 2026-27 ఖరీఫ్ సీజన్‌ను ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ కోనసీమ వ్యవసాయ ఆధారిత జిల్లా అని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రైతులు సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు.
ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమి గ్రామీణ వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని, భూమాతకు పూజలు చేసి సాగు పనులను ప్రారంభించడం రైతుల సంప్రదాయమన్నారు.
కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.




