Amalapuram: కోనసీమ జిల్లాలో వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Amalapuram: కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 19 పారా మెడికల్, సపోర్టింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Amalapuram: కోనసీమ జిల్లాలో వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Amalapuram: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, మరి యు పోస్టుల ఎంపిక కమిటీ చైర్మన్ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతి పదికన 19 పారా మెడికల్, సపోర్టింగ్ సిబ్బంది భర్తీకై నోటిఫికేషన్ జారీ చేసినట్లు పోస్టుల ఎంపిక కమిటీ కన్వీనర్ మరియు జిల్లా వైద్య సేవల సమ న్వయ అధికారి డాక్టర్ కె. కార్తీక్ వెల్లడి
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2026.
కోనసీమ జిల్లాలోని ప్రభు త్వ ఆరోగ్య సంస్థలలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో వివిధ కేటగిరీల లో ఖాళీగా ఉన్న 19 పారా మెడికల్ మరియు సపోర్టింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు డా కె. కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు 4, ఆఫీస్ సబర్నేట్ ఒకటి, జనరల్ డ్యూటీ అటెండెంట్ 13 పోస్టులు వెరసి 19 పోస్టులు నింప నున్నట్లు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆధీనంలోని ఈ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఏజెన్సీ ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
అభ్య ర్థులు సంబంధిత పోస్టులకు ప్రభుత్వం నిర్దేశించిన విద్యా, సాంకేతిక అర్హతలు కలిగి ఉండాలన్నారు ఈనెల 19 తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు మించ కూడదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాం గులు మరియు మాజీ సైని కులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయన్నారు దరఖాస్తు నమూనా, విద్యా ర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయిం ట్లు మరియు ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు జిల్లా అధికారిక వెబ్సైట్ https://konas eema.ap.gov.in లో అందుబాటు లో ఉంచబ డ్డాయన్నారు.
ఈనెల 19 తేదీ ఉదయం 10:00 గంటల నుండి వెబ్సైట్‌లో లభిస్తాయన్నా రు.పూర్తిగా నింపిన దర ఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాల నకళ్లతో జతచేసి, ఈ నెల 30 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించా ల్సి ఉంటుంద న్నారు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిట ల్ సర్వీసెస్ కార్యా లయం, ఏరియా హాస్పిటల్ అమలాపురం. నందు సమ ర్పించాలన్నారు అభ్య ర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తులు సమర్పించాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థి తుల్లోనూ స్వీకరించబో మని స్పష్టం చేశారు.
నియామకాలు అత్యంత పారదర్శకమని ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, రిజర్వేషన్ విధానం, రోస్టర్ పాయింట్లు మరియు మెరిట్ ప్రాతిపదికన అత్యంత పార దర్శకంగా నిర్వహించబడు తుందని డాక్టర్ కార్తీక్ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవ ర్తులను, దళారులను నమ్మి అభ్య ర్థులు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా అటు వంటి అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టప రమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవ కాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.




