Konaseema: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై 29న కలెక్టరేట్‌లో మినీ జాబ్ మేళా!

Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం.

SURESH, AMALAPURAM
Published on: 26 July 2026 7:36 PM IST
Konaseema
X

Konaseema: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై 29న కలెక్టరేట్‌లో మినీ జాబ్ మేళా!

కోనసీమ: కోనసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29వ తేదీ (బుధవారం) స్థానిక కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మహేష్ కుమార్ రావిరాల ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉద్యోగ జీవితానికి బలమైన పునాది వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఉదయం 10 గంటల నుంచి బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫాక్స్‌కాన్ (Foxconn) కంపెనీతో పాటు శ్రీ సిటీకి చెందిన అపోలో టైర్స్ సంస్థకు సంబంధించిన నియామక ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

19 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్,డిగ్రీ,బీటెక్,పీజీ పూర్తిచేసిన వారు లేదా చదువు మధ్యలో నిలిపివేసిన వారు కూడా తమ బయోడేటాతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని వికాస జిల్లా మేనేజర్ గోళ్ళ రమేష్ తెలిపారు.ఫాక్స్‌కాన్‌లో ఎంపికైన అభ్యర్థులకు సీటీసీ రూ.18,250తో పాటు ఉచిత భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పించబడతాయని పేర్కొన్నారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతతో పాటు చదువు పూర్తిచేసుకున్న యువతులకు ఇది మంచి అవకాశమని ఆయన అన్నారు.ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు (ఆఫర్ లెటర్లు) అందజేయడంతో పాటు, తక్షణమే విధుల్లో చేరే అవకాశం కూడా కల్పించనున్నట్లు తెలిపారు.మరిన్ని వివరాల కోసం వికాస జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story