Sakinetipalli: విషాదం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి!
Sakinetipalli: సఖినేటిపల్లి రామేశ్వరంలో విద్యుత్ పోలెక్కి పనిచేస్తుండగా షాక్ తగిలి ఎలక్ట్రీషియన్ వెంకట్రావు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sakinetipalli: విషాదం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి!
Sakinetipalli: సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కాకర వెంకట్రావు (37) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వెంకట్రావు రామేశ్వరం గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నెల 8న విద్యుత్ పోల్‌పై పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని రామేశ్వరం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చేర్పించారు.
అయితే అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు వెంకట్రావు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి అక్క కొల్లాబత్తుల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




