కోనసీమ కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’.. జేసీ ఆధ్వర్యంలో 225 అర్జీల స్వీకరణ

Amalapuram: కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 6 July 2026 12:38 PM IST
Amalapuram
X

కోనసీమ కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’.. జేసీ ఆధ్వర్యంలో 225 అర్జీల స్వీకరణ

అమలాపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డీఆర్ఓ వి. సుబ్బారావు, ఎస్‌డీసీ అచ్చుత కుమారి, డీఆర్‌డీఏ పీడీ టి. రాంబాబుతో కలిసి సుమారు 225 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సంతృప్తికరమైన సేవలు అందించాలని, సమస్య పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

అనంతరం అమరావతి ఛాంపియన్‌షిప్–2026 ప్రచార పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story