Kothapeta: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు పాడి గేదెలు బలి!
Kothapeta: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట-దేవరపల్లి రహదారిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తెగి వేలాడుతున్న తీగలు తగిలి రైతు ఆకుల దుర్గా మల్లేశ్వరరావుకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి.
Kothapeta: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు పాడి గేదెలు బలి!
కొత్తపేట: కొత్తపేటకు చెందిన ఆకుల దుర్గా మల్లేశ్వరరావు కి చెందిన రెండు గేదెలు విద్యుత్ ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్తపేట నుండి దేవరపల్లి కి వెళ్లే ప్రధాన రహదారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇదే ప్రదేశంలో స్థానిక ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విద్యుత్ తీగలు మనుషులకు గాని తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది అని స్థానికులు వాపోతున్నారు.
తుపాన్ ప్రభావం తో విద్యుత్ వైర్లు తెగి పడిన తుపాన్ పోయి సుమారు 20 రోజులు దాటిన తెగిన విద్యుత్ వైర్లను మరల స్తంభాలకే వేలాడదీసిన వైర్లకు విద్యుత్ రావడంతో మేతకు వచ్చిన 2 పాడి గేదెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. రెండు గేదెలను కోల్పోవడంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాడి పశువులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతుకు ఈ ఘటన తీరని నష్టాన్ని మిగిల్చింది.
విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించాలని, బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.




