Kothapeta: పలివెల, మోడేకుర్రులో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున బండారు శ్రీనివాస్ ప్రచారం!
Kothapeta: కొత్తపేట మండలం పలివెల, మోడేకుర్రు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహించారు.
Kothapeta: పలివెల, మోడేకుర్రులో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున బండారు శ్రీనివాస్ ప్రచారం!
కొత్తపేట: కొత్తపేట మండలం పలివెల గ్రామ NDA కూటమి సర్పంచ్ అభ్యర్థి గుర్రం నాగేశ్వరరావు గారు, మోడేకుర్రు గ్రామ NDA కూటమి సర్పంచ్ అభ్యర్థి గోలకోటి శ్రీలక్ష్మి యేసు గార్లకు మద్దతుగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను, ఓటర్లను కలుసుకుంటూ NDA కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.




