Chinthalamori: చింతలమోరి బీచ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన తోటలు

Chinthalamori: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం చింతలమోరి బీచ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం. 10 నుంచి 15 ఎకరాల సరుగుడు తోటలు దగ్ధం.

PRABHU, RAZOLE
Published on: 26 July 2026 3:31 PM IST
Chinthalamori
X

Chinthalamori: చింతలమోరి బీచ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన తోటలు

చింతలమోరి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని మలికిపురం మండలం చింతలమోరి బీచ్ సమీప తీర ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 10 నుంచి 15 ఎకరాల మేర సరుగుడు తోటలు అగ్నికి ఆహుతయ్యాయి.

సరుగుడు తోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో తీర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం రాజోలు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టం వివరాలు పూర్తిగా తెలియరాలేదు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story