Kesanapalli: కేశనపల్లి డెంగ్యూ నివారణపై వైద్య సిబ్బంది అవగాహన
Kesanapalli: డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా తూర్పుపాలెం-2లో వైద్య సిబ్బంది ర్యాలీ. ఫ్రైడే డ్రైడే పాటించాలని, దోమల వ్యాప్తిని అరికట్టాలని గ్రామస్థులకు సూచన.
Kesanapalli: కేశనపల్లి డెంగ్యూ నివారణపై వైద్య సిబ్బంది అవగాహన
కేశనపల్లి: డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి పీహెచ్‌సీ పరిధిలోని తూర్పుపాలెం-2 గ్రామంలో బుధవారం వైద్య సిబ్బంది విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎంపీహెచ్‌ఈఓ చంటి ఆధ్వర్యంలో మేల్ హెల్త్ అసిస్టెంట్లు కె. శివకుమార్, ఎస్. శ్రీరామమూర్తి, జి. గంగరాజు, ఎంఎల్‌హెచ్‌పీ సీహెచ్. పుణ్యవతి, ఏఎన్‌ఎం జి. భవాని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామంలో ర్యాలీ నిర్వహించి డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.అనంతరం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి శుక్రవారం 'ఫ్రైడే డ్రైడే' పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమతెరలను వినియోగించాలని, జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి తక్షణమే చికిత్స పొందాలని సూచించారు.




