Sakhinetiapalli: సఖినేటిపల్లిలో రాళ్ల కాల్వ అవుట్‌ఫాల్ స్లూయిస్ ప్రారంభం
Sakhinetiapalli: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో రూ.2.85 కోట్లతో పునఃనిర్మించిన రాళ్ల కాల్వ అవుట్‌ఫాల్ స్లూయిస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Sakhinetiapalli: సఖినేటిపల్లిలో రాళ్ల కాల్వ అవుట్‌ఫాల్ స్లూయిస్ ప్రారంభం
సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది దేవస్థానం గ్రామ పరిధిలో వశిష్ట గోదావరి ఎడమగట్టుపై రూ.2.85 కోట్ల వ్యయంతో పునఃనిర్మించిన రాళ్ల కాల్వ అవుట్‌ఫాల్ స్లూయిస్‌ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు.
సుమారు 75 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్లూయిస్‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా డబుల్ రోడ్డుగా, నాలుగు తూములతో రూ.2.85 కోట్లతో పునఃనిర్మించారు. దీంతో రైతులకు సాగునీటి నిర్వహణలో మరింత సౌకర్యం కలగనుందని ఎమ్మెల్యే తెలిపారు.
రాజోలు నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గొంది, నొవ్వ అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణానికి రూ.10.45 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు దేవ వరప్రసాద్ వెల్లడించారు. అదేవిధంగా రూ.3.20 కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న కడలి స్లూయిస్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని డ్రెయిన్లు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




