P Gannavaram: కోనసీమకు రైలు కావాలి: పి.గన్నవరంలో విద్యార్థుల ఆందోళన!
P Gannavaram: కోనసీమకు రైలు కావాలంటూ పి.గన్నవరంలో రోడ్డెక్కిన విద్యార్థులు. ఎన్నికల హామీని నెరవేర్చాలని సీఎం, డిప్యూటీ సీఎంలకు డిమాండ్.
P Gannavaram: కోనసీమకు రైలు కావాలి: పి.గన్నవరంలో విద్యార్థుల ఆందోళన!
P Gannavaram: కోనసీమకు రైలు కావాలనే నినాదంతో ఈ రోజు పి.గన్నవరం నియోజకవర్గం లో గల పలు విద్యాసంస్థల కు చెందిన విద్యార్థులు రోడ్డెక్కారు.కొన్ని కళాశాలల వద్ద విద్యార్థులు ర్యాలీ లు చేపట్టకుండా ఆంక్షలు విధించబడ్డాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ లు స్థానిక గడియారస్తంభం సెంటర్ లో మాట్లాడుతూ కోనసీమ రైల్వేప్రాజెక్ట్ ను తాము అధికారంలోకి వస్తె త్వరీతిగతిన పూర్తిచేస్తాం అని హామీ ఇచ్చిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు.
కోనసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న, తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడాలన్నా కోనసీమకు రైలు రావాల్సిందేనని విద్యార్థి లోకం స్పష్టం చేసింది.కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మీద ఒత్తిడి తీసుకువచ్చి ర్యాలీ లు జరగకుండా అడ్డుకోవడాన్ని కోనసీమ జేఎసి కార్యవర్గం త్రివంగా ఖండించింది.




