P Gannavaram: కోనసీమలో వర్షాలు: పంటలకు ఊరట.. రైతన్నల్లో టెన్షన్!

P Gannavaram: కోనసీమలో కురుస్తున్న వర్షాలు ఎండిపోయే దశలోని పంటలకు ఊరటనిచ్చినా, అరటి, పశుగ్రాసానికి నష్టం కలుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

RAJU, P GANNAVARAM
Published on: 25 Sept 2026 8:40 AM IST
P Gannavaram
X

P Gannavaram: కోనసీమలో వర్షాలు: పంటలకు ఊరట.. రైతన్నల్లో టెన్షన్!

P Gannavaram: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్నిచోట్ల గుంటలు చెరువులను తలపిస్తున్నాయి

వర్షాకాలం ప్రారంభం నాటి నుండి ఎల్ ని నో ప్రభావంతో వేసవి కాలాన్ని మించి ఎండలు కాయడంతో సరైన వర్షపాతం లేక రైతులు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు

తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. గత నెల రోజులుగా ఎండలు విపరీతంగా కాయడంతో తీవ్ర వర్షాభావంతో పంటలు నీరు లేక ఎండిపోయే దశకు వచ్చాయని రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొబ్బరి, అరటి, వరి చేలకు కాయగూరల పంటలకు చాలా మంచిదని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఎక్కువ వర్షపాతం నమోదు అయితే అరటి పంట నేలకొరికే ప్రమాదం ఉందని అంతేకాకుండా కొన్ని అంతర పంటలకు మంచిది కాదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

మరో రెండు మూడు రోజులు తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

రెండు నెలల క్రితం వచ్చిన వరదలకు పశుగ్రాసం ఎద్దడి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే లంకల లో పసుగ్రాసం పెరుగుతుందని మరీ ఎక్కువ వర్షాలు కురిస్తే పశుగ్రాసం కొరత వస్తుందని రైతులు భయపడుతున్నారు

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM