Razole: రాజోలు నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్!
Razole: రాజోలు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 214 కేంద్రాల్లో 1,00,497 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
Razole: రాజోలు నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్!
రాజోలు: రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు టోకెన్లు జారీ చేసి, వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది.
మండలాల వారీగా పోలింగ్ వివరాలు:
రాజోలు మండలం: 71 పోలింగ్ కేంద్రాల్లో 33,965 ఓట్లు పోలయ్యాయి. 57.42 శాతం పోలింగ్ నమోదైంది.
మలికిపురం మండలం: 70 పోలింగ్ కేంద్రాల్లో 31,715 ఓట్లు పోలయ్యాయి. 51.28 శాతం పోలింగ్ నమోదైంది.
సఖినేటిపల్లి మండలం: 73 పోలింగ్ కేంద్రాల్లో 34,817 ఓట్లు పోలయ్యాయి. 58.54 శాతం పోలింగ్ నమోదైంది.
మూడు మండలాల్లో కలిపి మొత్తం 214 పోలింగ్ కేంద్రాల్లో 1,00,497 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.




