Chintalapalli: చింతలపల్లిలో కరెంట్ పునరుద్ధరించాలని గ్రామస్తుల ఆందోళన!
Chintalapalli: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి పోతుమట్ల ప్రాంతంలో కరెంట్ సరఫరా చేయాలని కోరుతూ గ్రామస్తులు ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
Chintalapalli: చింతలపల్లిలో కరెంట్ పునరుద్ధరించాలని గ్రామస్తుల ఆందోళన!
చింతలపల్లి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలోని పోతుమట్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ గ్రామస్తులు గురువారం రాత్రి రాజోలులోని విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తుఫాను వెళ్లిపోయి రోజులు గడుస్తున్నా తమ ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు సక్రమంగా చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లు వెలిగించి తమ నిరసనను తెలియజేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పోతుమట్ల ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని, తమ నివాసాలకు వెంటనే విద్యుత్ సరఫరా అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.




